మీ తరపున తప్పకుండా న్యాయ పోరాటం : చంద్రబాబు
పుంగనూరులో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పోలీసులు తమ నిర్బంధంలో ఉన్న టీడీపీ నాయకులను కోర్టులో హాజరుపరచకుండా హింసిస్తున్నారని ఆరోపించారు. విచారణ పేరుతో అరెస్టు చేసిన కస్టడీలో కార్యకర్తలను హింసకు గురిచేస్తే, అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అరెస్టు చేసిన వారి నుంచి బలవంతంగా తప్పుడు స్టేట్మెంట్లపై సంతకాలు తీసుకుంటున్నారని తెలిసింది. పుంగనూరులో రాజకీయ నేతలను సంతృప్తి పరచడానికి తప్పులు చేసే ప్రతి అధికారి తర్వాతి కాలంలో సమాధానం చెప్పాల్సి వస్తుంది. అరెస్టైన పార్టీ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలి. పార్టీ అండగా ఉంటుంది. మీ తరపున తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు.













