దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా టీటీడీకి విరాళం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్ పుట్టిరోజు సందర్భంగా తిరుమలలో ఒకరోజు అన్న దాన కార్యక్రమం జరగుంది. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్న ప్రసాద వితరణకు ఒక రోజుకు రూ.30 లక్షల ఖర్చవుతుంది. ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు కానుకగా టీటీడీలో ఒక్క రోజు అన్నదాన వితరణకు అయ్యే వ్యయం రూ.30 లక్షలను విరాళంగా ఇవ్వడం చంద్రబాబు కుటుంబానికి ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా అదే విధంగా చంద్రబాబు కుటుంబం ఆ విరాళం మొత్తాన్నీ టీటీడీకి అందజేసింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆ విరాళంతో అన్నప్రసాదాలను వడ్డించాలని టీటీడీకి చంద్రబాబు కుటుంబం కోరింది. దీంతో తరిగొండ వెంగమాంబ నిత్యాప్రసాద భవనంలో టుడే డోనర్ మాస్టర్ నారా దేవాన్ష్ అనే పేరుతో ఒక్కరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.













