ఆ ముగ్గురి దెబ్బకు బాబు బుర్ర వాచిపోతుంది…?
తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. దీని వెనుక ప్రధాన కారణం ఏంటి అనేది తెలియదు. కానీ కీలక ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్లు కూడా సైలెంట్ గా ఉండటం పట్ల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అసలు మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరు కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా అర్థం కావడం లేదు.
పంచాయతీ ఎన్నికల్లో ఏలూరి సాంబశివరావు కాస్త కష్టపడ్డారు. మున్సిపాలిటీ ఎన్నికలలో మాత్రం ఆయన పెద్దగా దృష్టి సారించలేదు. గొట్టిపాటి రవికుమార్ విషయానికొస్తే అద్దంకి నియోజకవర్గంలో ఆయన పెద్దగా తిరగడం లేదని హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారని కొంతమంది అంటున్నారు. అలాగే ఆయనకు చెన్నైలో కూడా కొన్ని వ్యాపారాలు ఉన్నాయి. దీంతో అక్కడ అలాగే బెంగళూరులోని ఎక్కువగా తిరుగుతూ ఉన్నారని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కి సంబంధించిన అసలు చంద్రబాబు నాయుడు కాస్త తాడోపేడో తేల్చుకునే విధంగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.
వీళ్ళ అభిప్రాయం ఏంటి అనేది ఇప్పటి వరకు అర్థం కాలేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉంటే అన్ని విధాలుగా సహకరిస్తామని చంద్రబాబు నాయుడు వాళ్లకు హామీ కూడా ఇచ్చారు. అలాగే ఒక కీలక రాజ్యసభ ఎంపీ నుంచి స్పష్టమైన హామీ వచ్చింది. అయినా సరే వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు బయటకు రాలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే సాహసం కూడా వీళ్ళ ముగ్గురు చేయడం లేదు. ఇటీవల గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కాస్త విమర్శలు చేశారు.
కానీ గొట్టిపాటి రవికుమార్ గాని ఏలూరు సాంబశివరావు గాని అసలు మాట్లాడటం లేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వీళ్ళు సైలెంట్ ఉన్నారని తమ వ్యాపారాలకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకి కలిగించే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు మాట్లాడటం లేదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కానీ దీని వెనక ఉన్న ప్రధాన కారణం మాత్రం వాళ్లకు పార్టీలో కొన్ని అంతర్గత సమస్యలు ఉన్నాయని అందుకే బయటకు రావడం లేదని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. వీటి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు దృష్టిపెట్టిన సరే వీళ్ళిద్దరూ మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. గంటా శ్రీనివాసరావు ఆలోచన ఎలా ఉందో అర్థం చేసుకోవడం వైసీపీకి కూడా సాధ్యం కావడం లేదు.













