గెలిచినా జగన్ కు దక్కని ఫలితం.. ఇదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్..
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరు ఊహించని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బలం లేని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగడం కంటే కూడా.. దూరంగా ఉండడం మేలు అని బాబు భావిస్తున్నారట. అంతేకాదు ఈసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సరికొత్త రాజకీయాన్ని పరిచయం చేయడానికి చంద్రబాబు ఫిక్స్ అయ్యారు.
ఎన్నికలకు ముందే బాబు ఈసారి మీరు సరికొత్త చంద్రబాబును చూస్తారు అని చెప్పకనే చెప్పారు. మరి ఇప్పుడు దానిని ఆచరణలో పెట్టి మరి చూపిస్తున్నారు. ఇప్పటివరకు సాగిన తీరుకి భిన్నంగా రాష్ట్ర రాజకీయాలు ఉండాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయాన్ని బాబు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. మొత్తం ఈ ఎన్నికల్లో 838 ఓట్లు ఉన్నాయి.. ఇక అందులో అత్యధికంగా అంటే 500 కు పైగా ఓట్లు వైసీపీ చేతిలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో అధికారపక్షంగా ఉన్న కూటమిలోని ప్రధాన భాగస్వామి టీడీపీ బరిలోకి దిగుతుందని.. పోటీ బలంగా ఉంటుంది అని అందరూ ఆశించారు. అయితే ఈ అంశంపై చంద్రబాబు నిర్ణయం వేరేగా ఉన్నట్లు తెలుస్తోంది.
బలం లేని చోట బరిలోకి దిగడం కంటే కూడా ప్రజలకు మంచి చేయడంపై సమయాన్ని వెచ్చించడం పద్ధతిగా ఉంటుందని బాబు భావిస్తున్నారట. మరోపక్క కూటమిలో భాగస్తుడైన పవన్ కళ్యాణ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రాత్మకమైన గెలుపును అందుకొని ఇప్పుడు ఒక్క సీటు కోసం కక్కుర్తి పడితే ప్రజల్లో తన పార్టీయే పలచన పడిపోతుందని ఈ ఇద్దరు నాయకులు భావిస్తున్నారట. అంతేకాదు ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం అడ్డదారులు తొక్కిన అపవాదు వద్దని భావిస్తున్నారు. పోటీకి దూరంగా ఉండడం ద్వారా తమ బలం ఏమిటో చాటి చెప్పాలని టీడీపీ అధినేత గట్టిగా ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. ఇక ఇప్పుడు జగన్ తన పార్టీలో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకోగలిగిన గర్వంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. చంద్రబాబు అలా జగన్ ని బాగా ఇరికించారు అని ప్రజలు భావిస్తున్నారు.













