జైలు కావాలా? బంగారు భవిష్యత్ కావాలా?
కోడికత్తి పార్టీని చూస్తే పారిశ్రామికవేత్తలు పారిపోతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ 31 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. తనను నమ్ముకుంటే బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. అదే జగన్ని నమ్ముకుంటే మీకు జైలు తప్పదని వివరించారు. జైలు కావాలా? బంగారు భవిష్యత్ కావాలా? అని అడిగారు. మీ పిల్లల్ని జగన్తో పంపిస్తే చిన్నచిన్న నేరాలు చేయించి.. తర్వాత పెద్ద నేరాలు చేయించి జైలుకు పంపుతారని హెచ్చరించారు. వైసీపీ నేత చంపడమా? చావడమా? అంటున్నాడని గుర్తు చేశారు. మేము మిమ్మల్ని చంపం, చంపనీయం.. జైలుకి పంపుతామని వార్నింగ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు అధికారంలో వస్తే రక్షణ ఉంటుందా అని ప్రశ్నించారు.













