చంద్రబాబు జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన షెడ్యూలు ఖరారైంది. ఈ నెల 29న కృష్ణా జిల్లాతో మొదలై, డిసెంబరు 24న విజయనగరంతో ఆయన పర్యటన ముగుస్తుంది. మొత్తం 8 జిల్లాల్లో పర్యటిస్తారు. వరుసగా కృష్ణా, చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి, కడప, ప్రకాశం, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. పర్యటనలో కొన్ని మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలిపాయి.













