ఆ నలుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించండి : చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇచ్చామని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పీకర్‌ను కోరారు. వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరిని అనర్హులుగా ప్రకటించాలని ఇప్పటికే పార్టీ విప్ డోలా బాలవీరాంజనేయస్వామి పిటిషన్ వేశారు. డోలా ఇచ్చిన అనర్హత పిటిషన్‌పై శాసనసభ స్పీకర్ టీడీపీ అధినేత అభిప్రాయం కోరారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని చంద్రబాబు స్పీకర్‌కు తెలియజేశారు.













