బిజెపి తో టీడీపీ .. తిరిగి ఈ ఈక్వేషన్ సెట్ అవుతుందా..
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఏ పార్టీ లెక్కలు ఎటుపక్క ఉంటున్నాయో తెలియకుండా పోతుంది. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలి అని టీడీపీ.. వైయస్ఆర్సీపీ పోటాపోటీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ మద్దతు కోసం కాంగ్రెస్ వైపు చూస్తోంది. 2019 ఎన్నికలు ఓడినప్పటి నుంచి టీడీపీకి కాంగ్రెస్ కి మధ్య మంతనాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ లెక్కలు కాస్త తారుమారు అయ్యా అవకాశం కనిపిస్తోంది.
పలు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో ప్రధానంగా బీజేపీ గెలవడం.. రామ మందిరం నిర్మించి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేయడం తో బీజేపీ పై ఉన్న ఇమేజ్ ఒక్కసారి మారిపోయింది. మోడీ ఇమేజ్ తో పాటు ఈ పార్టీకి ఇప్పుడు కలిసి వచ్చిన హిందూ తత్వం పాయింట్ మళ్లీ ఢిల్లీ పీఠం తెచ్చిపెట్టే అవకాశం ఉంది. మరోపక్క ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ బీజేపీతో చేతులు కలిపాడు. దీంతో ఇండియా కూటమిలో పలు రకాల విభేదాలు మొదలయ్యాయి.
ఎన్నికల దగ్గర పడుతున్న ఈ తరుణంలో ఒకపక్క ఇండియా కూటమి ఇబ్బందుల పాలవుతుంటే మరోపక్క బీజేపీ బలపడుతోంది. దీంతో రాష్ట్రంలో అధికారంలోకి రావాలి అంటే బిజెపితో కలిసి ప్రయాణించడం మేలు అని టీడీపీ వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లెక్కలు సరిచేసుకోవడానికి చంద్రబాబు స్వయంగా ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారట. ఈ నేపథ్యంలో ఇదే విషయానికి సంబంధించి చర్చించడానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు భేటీ అవుతున్నాడు.
అయితే బీజేపీ ఆలోచన వైఖరి ఇందుకు భిన్నంగా ఉన్నట్లు అనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లలో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయడానికి బిజెపి సిద్దపడుతోందట. అయితే తమతో పొత్తు ఉన్న జనసేన ను మాత్రం తమతో కలిసి రమ్మని కోరుతోంది. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మాత్రం టిడిపి తోటే కలిసి ప్రయాణం అంటున్నాడు. అలాగే బీజేపీని కూడా తమతో పొత్తుకు పిలుస్తున్నాడు. ఇప్పుడు జరుగుతున్న ఈ ట్రయాంగిల్ పొత్తుల పోరు ఎన్నికలకు ముందే తేలిపోతుంది. ఎవరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారు అనే లెక్కలు రాబోయే ఎన్నికలలో చాలా కీలకమైనవి.













