పులివెందుల టీడీపీ అభ్యర్థి ఖరారు
కడప జిల్లా పులివెందుల శాసనసభ స్థానానికి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరెడ్డ రవీంద్రనాథ్ రెడ్డి (బీటెక్ రవి)ని పార్టీ అధినేత చంద్రబాబు ఖరారు చేశారు. పులివెందుల నియోజకవర్గ నాయకులతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు అభ్యర్థిపై స్పష్టతనిచ్చారు. గత ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసిన ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి మళ్లీ పార్టీలోకి వస్తారని ప్రచారం జరుగుతోందని కొందరు నేతలు ప్రస్తావించారు. ఎవరు వచ్చినా రాబోయే ఎన్నికల్లో అక్కడ బీటెక్ రవీ పోటీ చేస్తారని చంద్రబాబు స్పష్టం చేశారు.













