ఆనంను పరామర్శించిన సీఎం చంద్రబాబు
అనారోగ్యంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ఆనం వివేకానందరెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. మంత్రులు సొమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణతో కలిసి ఆయన కిమ్స్ ఆసుపత్రి వచ్చారు. ఆనం కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయనకు అందుతున్న వైద్యం గురించి ఆసుపత్రి ఎండీ భాస్కర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భాస్కర్‌రావు మాట్లాడుతూ ఆనం వివేకానందరెడ్డికి ప్రస్తుతం రేడియేషన్ చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఆరోగ్యం స్వల్పంగా మెరుగైందని, పూర్తిస్థాయిలో కోలుకోవడానికి కొద్ది సమయం పడుతుందన్నారు.













