ఆయనతో రాజకీయ విభేదం తప్ప వ్యక్తిగత వైరం లేదు
రాజశేఖర్‌రెడ్డి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఆయనతో రాజకీయ వైరం తప్ప వ్యక్తిగత వైరం లేదని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. అసెంబ్లీలో విగ్రహాల తొలగింపుపై జరిగిన చర్చలో భాగంగా చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలంటే చంద్రబాబుకు కడుపు మంట అని విజయవాడలో ఎవరికీ అడ్డం లేని చోట రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఉందన్నారు. రోజూ చంద్రబాబు వెళుతుంటే ఆ విగ్రహాన్ని చూసి ఓర్వలేక దానిని తొలగించిన మహానుభావుడు చంద్రబాబు అని అంబటి ఎద్దేవా చేశారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్. 1975 నుంచి 1983 వరకు కలిసి ప్రయాణం చేశాం. రాజశేఖర్ రెడ్డి, నేను ఒకే రూమ్‌లో ఉండే వాళ్ళం. జగన్‌కు మా స్నేహం తెలియకపోవచ్చు. వైఎస్సార్‌తో రాజకీయ విభేదం తప్ప… వ్యక్తిగత వైరం లేదు అని చంద్రబాబు సృష్టం చేశారు.













