కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు స్పందన లేదు: టెలికాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు
అందుకే హడావుడిగా నిన్న జగన్ తో కెటిఆర్ భేటి. ఈ భేటితో టిఆర్ ఎస్, వైసిపి ముసుగు తొలగిపోయింది. బిజెపి వ్యతిరేక ఓట్లను చీల్చాలని కుట్రలు. బిజెపి వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా కుతంత్రాలు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోది పాలన అప్రదిష్ట పాలైంది. బిజెపి ప్రజా వ్యతిరేక చర్యలపై ప్రజల్లో తీవ్ర అసహనం. దానిని కప్పెట్టేందుకే ఈ విధమైన కుట్రలకు తెరదీశారు. టిఆర్ ఎస్ తో, వైసిపితో దొంగనాటకాలు ఆడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇస్తే మాకూ ఇవ్వాలని కెసిఆర్ అన్నారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంస్థల విభజనకు అడ్డంకులు పెట్టారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయనివ్వలేదు. విభజన చట్టంలో అంశాలు అమలు చేస్తారా..? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అమలు చేయమని చెబుతారా..? పోలవరం ప్రాజెక్టుకు అడ్డం పడకుండా ఉంటారా..? ఏపి ప్రత్యేక హోదాకు అడ్డం పడకుండా ఉంటారా..? బిజెపి అజెండా అమలు చేసేందుకే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు. దేశంలో పార్టీలను గందరగోళ పరచడం, ప్రజల్లో అయోమయం పెంచడం వీరి లక్ష్యం.













