రాయలసీమను ఉద్యావనహబ్ గా మారుస్తాం : చంద్రబాబు
సాగునీటి రంగ నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పర్యటనలోని కళ్యాణదుర్గంలో నిర్వహించిన వ్యవసాయ సంక్షోభంపై ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా రైతులకు పెట్టుబడి రాయితీ, పంట బీమా ఇచ్చిన ఘనత టీడీపీదని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో హంద్రీనీవాపై రూ.4.200 కోట్లు ఖర్చు చేశామన్నారు. అనంతపురం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రతి ఎకరాకు నీరిస్తామన్నారు. రాయలసీమను ఉద్యానహబ్గా మారుస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతుల్లో చైతన్యంతోనే వ్యవసాయ రంగాన్ని బతికించవచ్చని తెలిపారు. రైతు బతకాలి, జగన్ పోవాలి అని అన్నారు.













