ఆ పార్టీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేం : చంద్రబాబు
వైసీపీ ముఖ్యనేతలు టీడీపీకి టచ్లోకి వస్తున్నారని, అలాగని ఆ పార్టీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని నివాసంలో పలువురు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. రా కదలిరా, లోకేశ్ శంఖారావం సభలతో పాటు వివిధ రాజకీయ అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భగా చంద్రబాబు మాట్లాడుతూ అన్నీ ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. పొత్తులు, చేరికల వల్ల పార్టీలో కష్టపడిన నేతలకు నష్టం జరగకూడదు. వారి భవిష్యత్తుకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. దానికే అధిక ప్రాధాన్యత ఇస్తాం అని తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని పోటీకి నిలబెట్టే ఆలోచన లేదు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యనమల, నిమ్మల, అనగాని, గొట్టిపాటి, కంభంపాటి పాల్గొన్నారు.













