సీఎంగా తొలిసారి ప్రమాణం చేసి 26 ఏళ్లు
మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 26 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పేదరికం లేని సమాజమే తన సంకల్పమన్నారు. మహిళా సాధికారతే టీడీపీ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు, టీడీపీ అంగన్వాడీ వర్కర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఎం. కల్యాణి, కె.ప్రవీణ, నీరజ, వందన, లక్ష్మీ, చైతన్య, శ్రీకాంత్, ప్రవీణ్, సాయి, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.













