Srinivas Reddy : లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని చంద్రబాబుకు విజ్ఞప్తి!
వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)ను డిప్యూటీ సీఎం (Deputy CM )గా చేయాలని చంద్రబాబుకు సభా వేదిక నుంచి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) విజ్ఞప్తి చేశారు. అంతకుముందు కడప విమానాశ్రయంలో జిల్లా నేతలు, అధికారులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. కడప నుంచి హెలికాప్టర్లో సీఎం మైదుకూరు చేరుకున్నారు.













