అక్షరాస్త్రం పుస్తక ఆవిష్కరణలో చంద్రబాబు
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మీడియా సంస్థలు, పాత్రికేయులపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రముఖ పాత్రికేయుడు నీరుకొండ ప్రసాద్ రచించిన అక్షరాస్త్రం పుస్తకాన్ని ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన ఆవిష్కరించారు. ప్రజలను ఆలోచింపజేసేలా ఈ పుస్తకం ఉందని, వైసీపీ నేతల అరాచకాలు, అక్రమాలను వెలుగులోకి తెస్తూ పాత్రికేయుడిగా ప్రసాద్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.













