ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘క్రిస్మస్ పర్వదినం వేడుకలు జరుపుకుంటున్న క్రైస్తవ సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు. సమాజంలో బాధితుల పక్షాన నిలబడటం, అందరికీ ప్రేమను పంచడం, అందరినీ సమానంగా చూడటం ద్వారా క్రీస్తు ఆశించిన శాంతియుత సమాజాన్ని స్థాపించడానికి కృషి చేద్దాం’ అని చంద్రబాబు తెలిపారు. అలాగే పవన్ కల్యాణ్ కూడా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పవిత్ర పండుగ సమయంలో క్రైస్తవ మత ఆరాధకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. సమాజం చైతన్యం కావడం కోసం క్రీస్తు బోధించిన శాంతి, సహనం, ఔదార్యం ఆచరణీయం. ప్రతి మనిషి ఎంతో కొంత పరోపకార గుణం అలవరుచుకోకపోతే జీవితానికి అర్థం ఉండదని క్రైస్తవం బోధిస్తుంది. ఈ క్రిస్మస్ పర్వదినాన దేశ ప్రజలందరూ శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ నా తరఫున, జనసేన శ్రేణుల తరఫున మనసారా కోరుకుంటున్నాను” అని పవన్ కల్యాణ్ చెప్పారు.













