ఆ 31 మందిని నేను ఎప్పటికీ మరువలేను.. చంద్రబాబు
ఆంధ్రాలో రాబోయే ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా కలిసిన కారణంతో సీట్లు అందరికీ సర్దుబాటు చేయలేకపోయారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు.. బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 ఎంపీ సీట్లు జనసేన 22 ఎమ్మెల్యే,2 ఎంపీ సీట్లు చొప్పున కేటాయించడం జరిగింది. రాబోయే ఎన్నిక టీడీపీ తరఫున చంద్రబాబు ఇప్పటికే 139 అసెంబ్లీ మరియు 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఈరోజు ప్రకటించిన అభ్యర్థులతో కలిసి విజయవాడలో చంద్రబాబు ఆధ్వర్యంలో వర్క్ షాప్ కూడా నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కి హాజరైన చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంపై దిశా నిర్దేశం చేశారు. అలాగే పార్టీ కోసం 31 మంది రాజీ పడ్డారని.. భారీ త్యాగాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని చంద్రబాబు పేర్కొన్నారు. కూటమి పొత్తుల కారణంగా ఈ 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయినట్లు చంద్రబాబు చెప్పారు. ఈసారి అభ్యర్థుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని.. నిలబెట్టిన ప్రతి అభ్యర్థి గెలుస్తారని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అలాగే టికెట్టు రాని నేతలు బాధపడాల్సిన అవసరం లేదని.. వారికి ఎప్పుడు పార్టీ అండగా ఉంటుంది అని అన్నారు.













