ఇచ్చిన హామీ నెరవేర్చాక..బస్సు ఎక్కు.. జగన్ కు చంద్రబాబు సవాల్..
ఒక్క ఛాన్స్ అంటూ పదవిలోకి వచ్చి.. ఐదు సంవత్సరాల కాలాన్ని దోపిడీ కోసం ఉపయోగించుకున్నారు అని జగన్ పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. 99% హామీలు అమలు చేస్తాను అని మాట ఇచ్చి ప్రజలను ఏ మార్చాడని ఆరోపించారు. ఈసారి ఏపీ ప్రజలను మోసం చేయడానికి మరోసారి జగన్ బస్సు యాత్ర మొదలు పెడుతున్నాడు అని చంద్రబాబు విమర్శించారు. గత ఎన్నికల హామీలను పక్కనపెట్టి.. కొత్తగా ప్రజలను బుట్టలో వేయడానికి జగన్ బస్సు యాత్ర మొదలుపెట్టాడని మాజీ ముఖ్యమంత్రి.. టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ముందు ఇచ్చిన హామీలకు బదులు ఇస్తేనే బస్సు ఎక్కాలి జగన్ అంటూ సవాల్ విసిరారు. హామీలు అమలు చేయడం అనేది జగన్ ఆడిన ఒక బూటకపు నాటకం అని…గురువారం చంద్రబాబు ట్వీట్ చేశారు. ఐదేళ్ల పాలనలో విధ్వంసం తప్ప జగన్ ఒరగబెట్టింది ఏమీ లేదు అని సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు విమర్శించారు. జగన్ రెడ్డి 99 మోసాలు.. ప్రజలను ఏమార్చిన 99 హామీలు అంటూ లోకేష్ వీడియోని పోస్ట్ చేశారు. అంతేకాకుండా హామీలు నెరవేర్చాకే ఓట్లు అడగడానికి వస్తాను అని అన్నావు కదా.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నావు జగన్.. పరదాలు ఉండగా నీకేం భయం అంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. ఈ వీడియో ట్వీట్ ని చంద్రబాబు రీ ట్వీట్ చేస్తూ జగన్ కు సవాల్ విసిరాడు.













