రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలను పునర్ముద్రిస్తాం…చంద్రబాబు
ఆంధ్రాలో ఎన్నికల హడావిడి కంటే కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలకు ఉన్న కన్ఫ్యూషన్ భారీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఎన్నికల్లో అస్త్రంగా మార్చుకున్న చంద్రబాబు మరొకసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి బొమ్మ ఉన్న పట్టాదారు పాసు పుస్తకాల జిరాక్స్ కాపీలను ప్రజలంతా వీధులలో తగలబెట్టి.. తమ నిరసన తెలుపవలసిందిగా పిలుపునిచ్చారు. అంతేకాదు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఉండాల్సిన అవసరం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాజముద్ర తో ఉన్న పాసు పుస్తకాలను పునర్ముద్రిస్తామని చంద్రబాబు తెలిపారు. సోమవారం జరిగే ఎన్నికలలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని.. తమ భవిష్యత్తు బాగుండాలి అంటే కూటమిని ఎన్నుకోవాలని చంద్రబాబు ఓటర్లను కోరారు.













