ప్రభుత్వ సాయంతో అమెరికా వెళ్లిన విద్యార్థులతో 6న సీఎం భేటీ
అమెరికా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బ్రహ్మణ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల సాయంతో విదేశాల్లో చదువుకుంటున్న పలువురు విద్యార్థులతో ఈ నెల 6న డాలస్లో సమావేశం కానున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం పలువురు పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ సంస్థలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి వారిలో 600 మంది వరకు ఒక్క అమెరికాలోనే ఉన్నారు. ఈనెల 4 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయా విద్యార్థులు సమావేశమయ్యేలా కాపు కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం లభించింది.













