టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ లో శిక్షణ పూర్తిచేసుకున్న విద్యార్థులకు..
టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంపవర్మెంట్ కేంద్రంలో యూఎస్ ఐటీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, డిజిటల్ మార్కెటింగ్ కోర్సుల్లో శిక్షణ పొందిన 40 మంది విద్యార్థులకు ఎమ్మెల్సీ అశోక్బాబు ధ్రువపత్రాల్ని అందజేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో మెరుగన శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ప్రసాద్, సెంటర్ కో ఆర్డినేటర్ యామినీ పెండ్యాల తదితరులు పాల్గొన్నారు.













