విజయవాడలో పాస్ పోర్టు సేవాకేంద్రం!
విజయవాడలో పోస్టల్ పాస్‌పోర్టు సేవా కేంద్రం ఏర్పాటుకానుంది. దేశంలోని అన్ని ప్రధాన తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టు సేవాకేంద్రాల ఏర్పాటులో భాగంగా దీనికి సన్నాహాలు జరుగుతున్నాయి. వన్‌టౌన్‌లోని ప్రధాన తపాల కార్యాలయం, బకింగ్‌హాంపేట పోస్టాఫీసు, వెంకటేశ్వరపురం పోస్టాఫీసుల్లో ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల మూడో వారానికి నిర్ణయం తెలియజేసే అవకాశముంది. ఈ కేంద్రంలో పోస్టల్‌శాఖ తరపున అధికారులతో సహా మొత్తం ఐదుగురు సిబ్బంది ఉండనున్నారు. ఇక్కడే విదేశాంగ మంత్రిత్వశాఖ నుంచి మరొకరు ఉండనున్నారు. టాటా కన్సల్టెన్సీ సంస్థ సాంకేతిక సహాకారాన్ని అందించనున్నది.













