ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం మొండిచేయి
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ-గుంటూరు కొత్త రైల్వే లైన్‌కు కేంద్రం మొండిచేయి చూపింది. రాజధాని అమరావతిని అనుసంధానం చేస్తూ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేయాల్సిందిగా 2017-18 బడ్జెట్లో ప్రతిపాదించగా.. దీనిపై కేంద్రం ఇప్పటివరకూ సృష్టత ఇవ్వలేదు. తాజాగా నీతి ఆయోగ్ చెప్పిందంటూ రైల్వే లైన్ పనుల ఆమోదానికి సంబంధించిన దస్త్రాలను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. రైల్వేలైన్ ఏర్పాటుపై రాజ్యసభలో టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు ఆ శాఖ మంత్రి పియూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ, ఉపరితల రవాణా శాఖ, పట్టణాభివృద్ధి శాఖల మధ్య సంప్రదింపుల ప్రక్రియ పూర్తి కాలేదని, అప్పటి వరకు రైల్వే లైన్‌కు అనుమతులు ఇవ్వడం సాధ్యం కాదని గోయల్ సభలో వెల్లడించారు.













