ఏఎన్‌యూలో ఆస్ట్రేలియన్ స్టడీస్ సెంటర్ ప్రారంభం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఆస్ట్రేలియన్ అధ్యయన కేంద్రాన్ని చెన్నైలోని ఆస్ట్రేలియా కాన్సులేట్ కార్యాలయ వైఎస్ కాన్సుల్ ఆండ్రూ కోలిస్టర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కోలిస్టర్ ప్రసంగిస్తూ అధ్యయన కేంద్రం ద్వారా ఆస్ట్రేలియాకు సంబంధించిన అంశాలపై విద్య, పరిశోధనాంశాలు కొనసాగుతాయన్నారు. సాంస్కృతిక, సాహిత్య అంశాల అధ్యయనం ద్వారా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని చెప్పారు. ఆస్ట్రేలియా సంప్రదాయం, సంస్కృతి, క్రీడాకారులను భారతీయులు ఇష్టపడినట్లుగానే భారతీయ సంస్కృతి, సంప్రదాయం, క్రీడారులకు కూడా ఆస్ట్రేలియా దేశానికి చాలా మంది ఇష్టపడతారని తెలిపారు.
తనకు భారతీయ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అంటే ఎంతో ఇష్టమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకున్న పరిస్థితుల నేపథ్యంలో తమ దేశం భారత్‌తో బలమైన బంధాన్ని కోరుకుంటోందని తెలిపారు. వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ డాక్టర్ బి.కరుణ తదితరులు పాల్గొన్నారు.













