విశాఖ ఉక్కు పై కేంద్రం మరో ముందడుగు
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కేంద్ర ఆర్థికశాఖకు చెందిన పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల విభాగం ఈ దిశగా చర్యలు ప్రారంభించింది. విశాఖ ఉక్కు, దాని అనుబంధ, ఉమ్మడి సంస్థల్లో నూటికి నూరుశాతం పెట్టుబడులు ఉపసంహరణ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు న్యాయ, వ్యవహారాల సలహాదార్ల నియామకానికి ప్రభుత్వం ప్రకటించిన బిడ్డింగ్‌లో పాల్గొన్న చెరి పది సంస్థల పేర్లను ప్రకటించింది. ఈ సంస్థల ప్రతినిధులకు ఈ నెల 30న ఇంటర్వ్యూలు నిర్వహించి ఒక సంస్థను ఎంపిక చేస్తారు. న్యాయ, వ్యవహారాల సలహా సంస్థల ఎంపిక తర్వాత విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మే ప్రక్రియ ఊపందుకుంటుంది.













