ఏపీలో కేంద్ర బృందం పర్యటన
కరోనా వైరస్ ఉధృతి దృష్ట్యా ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని తాజా పరిస్థితులను సమీక్షించేందుకు కేంద్ర ప్రత్యేక బృందం రాష్ట్రానికి వచ్చింది. ఇందులో భాగంగా కొవిడ్ కంట్రోల్ రూమ్‌లో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహార్ రెడ్డితో భేటీ అయ్యారు. వైరస్ వ్యాప్తి, స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైరస్ ఉధృతి ఎక్కువగా ఉన్న గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. రాష్ట్రంలో పరిస్థితిని కేంద్ర బృందాలకు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆంధప్రదేశ్‌లో పర్యటిస్తున్న కేంద్ర కరోనా బృందంలో కృష్ణా జిల్లాలో డాక్టర్ వివేక్ అధిష్, డాక్టర్ రుశి గైలాంగ్ పర్యటించనున్నారు. కర్నూలు జిల్లాకు డాక్టర్ సంజయ్ సాధు, డాక్టర్ ఎం.డోబె వెళ్లనున్నారు. గుంటూరు జిల్లాకు డాక్టర్ బాబీ పాల్, డాక్టర్ నందిని భట్టాచార్య వెళ్లనున్నారు.













