త్వరలో ఏపీకి కేంద్ర బృందం ?
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్ర హోంశాఖ యోచిస్తోంది. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఇప్పటికే పశ్చిమ్‌బెంగాల్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, మధప్రదేశ్కు కేంద్ర బృందాలు వెళ్లాయి. తీవ్రత ఎక్కువగా ఉన్న మిగిలిన రాష్ట్రాలకూ బృందాలను కేంద్రం పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడో, రేపో ఆంధప్రదేశ్‌కి కూడా కేంద్ర బృదం రానున్నట్లు సమచారం. కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో రోజురోజుకీ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ఆయా చోట్ల పర్యటించే అవకాశముంది.













