Rammohan Naidu: ప్రగతి సంకల్పానికి ఇలాంటి ఉత్సవాలే ప్రేరణ : కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

విజయ దశమి అనగానే మైసూరు(Mysore) , కోల్‌కతా(Kolkata) ఉత్సవాల గురించి మాట్లాడుకుంటాం. ఈ 11 రోజుల ఉత్సవ్ పూర్తయ్యాక దేశంలో ఎక్కడైనా విజయదశమి ప్రస్తావన వస్తే విజయవాడ (Vijayawada) గురించి మాట్లాడుకునే స్థాయిలో నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడైనా దసరా (Dussehra) ఉత్సవాలు చేయాలంటే విజయవాడ ఉత్సవాలే నమూనాగా నిలుస్తాయి. ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు జరగాలంటే మానవ, దైవ సంకల్పాలు మమేకం కావాలి అని కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) పేర్కొన్నారు. ఉత్సవాల 8వ రోజు విజయవాడ ఉత్సవ్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో అంతరించిపోతున్న కళలకు జీవం పోయడమే ఉత్సవ్‌కు గొప్ప విజయం. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మొదలు అనంతపురం వరకు అన్ని ప్రాంతాల కళల పరిరక్షణ, కళాకారులను గౌరవించడమే కేంద్ర బిందువుగా కార్యక్రమం జరుగుతోంది. ఉత్సవ్‌లో హెలిరైడ్ ద్వారా నా ప్రాతినిధ్యం కూడా ఉన్నందుకు ఆనందంగా ఉంది. డ్రోన్ ప్రదర్శన చూస్తే నాకు గతంలో ఇదే పున్నమి ఘాట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన డ్రోన్ సమ్మిట్ గుర్తొస్తోంది. ఈ విజయదశమి మెగా కార్నివాల్ వాక్ కార్యక్రమంతో మరో గిన్నిస్ రికార్డు సాధిస్తాం అని తెలిపారు.