అసెంబ్లీ ఎక్కడ ఉందో.. అదే రాజధాని
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కేంద్ర మంత్రి నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎక్కడ ఉందో అదే రాజధాని అని స్పష్టం చేశారు. కేంద్ర నుంచి చాలా పనులకు అనుమతులు పొందరన్నారు. 40 శాతం పనులు పూర్తయ్యాక రాజధానిని కాదనడానికి వీల్లేదని తెలిపారు. పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య అమరావతి అభివృద్ధి చెందిందని తెలిపారు. రాష్ట్ర రాజధానిని రాజకీయ పార్టీలు నిర్ణయించలేవని నారాయణ స్వామి వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు విడిపోయి ఈ ఏడాది జూన్ రెండవతేదీ నాటికి ఎనిమిదేళ్లు దాటిందన్నారు. విభజన చట్టం ప్రకారం, అంతా అనుకున్నట్టుగా సవ్వంగా జరిగివుంటే హైదరాబాద్ కోల్పోయి రాజధాని అంటూ లేకుండా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ ఈపాటికే నూతన రాజధాని ఏర్పాటు చేసుకొని పాలన పరుగులు తీస్తూవుండేదన్నారు.













