జూన్ 21న 25 కోట్ల మందితో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానంతరం ఆయన మీడియతో మాట్లాడుతూ రానున్న ఆగస్టు 15న దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాఆaలని పిలుపునిచ్చారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 25 కోట్ల మందితో యోగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని 75 ప్రాచీన కట్టడాల వద్ద పర్యాటకులకు పూర్తి సౌకర్యాలను కల్పించనున్నట్లు తెలిపారు.













