రామాయపట్నం పోర్టుకు.. కేంద్రం షాక్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని రామాయపట్నం పోర్టు నిర్మాణానికి సాయం చేయలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విభజన చట్టం ప్రకారం పెద్దపోర్టుల అభివృద్ధి మాత్రమే కేంద్రానిదని తెలిపింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఓడరేవులు, నౌకాయానశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. రామాయపట్నం పెద్ద పోర్టు కాదని రాష్ట్ర ప్రభుత్వమే తెలిపిందని, నాన్ మేజర్ పోర్టుల అభివృద్ధి బాధ్యత రాష్ట్రాలపైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆ పోర్టును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలంటే చట్టంలో మార్పులు తేవాల్సి ఉందన్నారు.













