పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం సృష్టత…..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం సృష్టత ఇచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం, పరిహారానికి సంబంధించిన అంశాలపై సమాచార హక్కుచట్టం కింద దాఖలు చేసిన ఆర్జీకి కేంద్రం సమాధానమిచ్చింది. విజయవాడకు చెందిన సౌరబ్ఖమర్ ఈ ఆర్జీ దాఖలు చేశారు. ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం సృష్టం చేసింది. పునరావాస, పరిహార ప్యాకేజీతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. 2015 నుంచి ఇప్పటివరకు పోలవరం నిర్మాణానికి రూ.8,614 కోట్లు ఖర్చయినట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.950 కోట్లు, నాబార్డు ద్వారా రూ.7,664.16 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపింది. పోలవరానికి చేసిన వ్యయంలో ఇంకా రూ.2,234.77 కోట్లు పెండింగ్లో ఉన్నట్లు సృష్టం చేసింది.












