పాస్‌పోర్టు పరిశీలనలో ఏపీ పోలీస్‌కు కేంద్ర పురస్కారం
పాస్‌పోర్టుల జారీలో కీలకమైన వెరిఫికేషన్ సేవల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం అత్యున్నత సేవలు అందించినందుకు కేంద్ర పురస్కారం దక్కింది. దేశంలోనే ఏపీ పోలీసు అగ్రగామిగా నిలిచింది. దీనికి గుర్తింపుగా ఏపీ పోలీసుకు కేంద్ర ప్రభుత్వ పురస్కారం ప్రకటించడంతో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ చేతలు మీదుగా రాష్ట్ర ఇంటిలిజెన్స్ అదనపు డిజి ఏబి వెంకటేశ్వరరావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆన్లైన్ సేవల ద్వారా పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ను ఏపీ పోలీసు త్వరితగతిన పూర్తి చేసి ప్రజల మన్ననలు పొందింది.













