రాజధాని అంశంపై తొలిసారిగా స్పందించిన కేంద్రం
ఏపీ రాజధాని అంశంపై కేంద్రం తొలిసారిగా స్పందించింది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర ప్రభుత్వం సృష్టం చేసింది. దాన్ని రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. లోక్సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ నోటిఫై చేసింది. 2015 ఏప్రిల్ 23న విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా కథనాల ద్వారానే తెలిసింది. రాష్ట్ర పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం ఆ ప్రభుత్వానికి ఉన్నది అని నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు.













