జూన్ 23న ఉప ఎన్నికలు.. ఏపీలో ఆత్మకూరు సహా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభా స్థానానికి ఉప ఎన్నికకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో జూన్ 23న పోలింగ్ జరపాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మూడు లోక్‌సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 30న ఉప ఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. నామినేషన్లుకు తుది గడువు జూన్ 6 గా నిర్ణయించారు. నామినేషన్ల పరిశీలన జూన్ 7న జరుగుతుంది. నామినేషన్ల ఉప సంహరణకు గడువు జూన్ 9గా నిర్ణయించారు. జూన్ 23న పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు జూన్ 26న జరుగుతుంది.













