ఆంధ్రప్రదేశ్‌కు రూ.491.41కోట్ల కేంద్ర నిధులు..
లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాల విజ్ఞప్తుల మేరకు కేంద్రం నిధులు విడుదల చేసింది. దేశంలో లోటు బడ్జెట్ ఉన్న 14 రాష్ట్రాలకు నిధులు విడుదల చేశారు. దీనికి గాను 15వ ఆర్థిక సంఘం సూచనలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇప్పటికే 4 దఫాలుగా ఈ నిధులు విడుదల చేసిన నేపధ్యంలో 5 విడత నిధులు కూడా మంజూరు చేశారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్యూ లోటు కింద రూ ,491.41 కోట్లు విడుదల చేశారు. మొత్తం 14 రాష్ట్రాలకు కలిపి 6195.08కోట్లు నిధులు విడుదల చేసినట్టు కేంద్రం వెల్లడించింది.













