అరుణ్ మిల్లర్ సొంతూరులో సంబరాలు
అమెరికా మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కాట్రగడ్డ అరుణ మిల్లర్ ఘన విజయం సాధించడంతో ఆమె గ్రామంలో సంబురాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామానికి చెందిన కాట్రగడ్డ అరుణ్ మిల్లర్ స్వస్థలం. అగ్రరాజ్యం అమెరికాలో లెఫ్ట్నెంట్ గవర్నర్గా అరుణ విజయం సాధించడంతో వెంట్రప్రగడ గ్రామంలో బంధువులు, గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసిన గ్రామస్తులు, బంధువులు మిఠాయిలు తిపిపించుకుంటు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అగ్రరాజ్యంలో అరుణ అరుదైన గౌరవం సాధించడం తమకు ఎంతో గర్వంగా ఉందని, అరుణ విజయంతో మారుమూల గ్రామమైన వెంట్రప్రగడకు ఎంతో పేరు వచ్చిందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.













