గుడివాడ అభ్యర్ధి నందమూరి కుటుంబ వ్యక్తే…? నిర్ణయం తీసుకున్న చంద్రబాబు…!
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా సరే విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం పట్టుదలగా ఉంది. ఈసారి తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందనే ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో ఉంది. పార్టీ కీలక నేతలు అందరూ ఇప్పుడు దీని మీదనే ఫోకస్ చేసి జిల్లాల వారీగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అసంతృప్తి ఉన్న నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చర్చలు జరుపుతున్నారు.
ఆర్ధికంగా బలంగా ఉన్న వారిని ముందుకు నడిపిస్తూనే పార్టీకి పని చేయడానికి ఆసక్తిగా ఉన్న నాయకులను ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపధ్యంలో గుడివాడ మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. గుడివాడలో ఎలా అయినా సరే కొడాలి నానీని ఓడించాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. తాజాగా గుడివాడలో ఒక భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసారు. అయితే అభ్యర్ధి విషయంలో చంద్రబాబు మాత్రం ఇంకా నిర్ణయానికి రాలేదు అనే అంటున్నాయి పార్టీ వర్గాలు. అందరూ రావి వెంకటేశ్వరరావు పేరునే ఖరారు చేస్తారని భావిస్తున్నారు.
ఈ తరుణంలో వెనిగండ్ల రాము అనే ఎన్నారై పేరు కూడా వినపడింది. ఆయన అక్కడ కాస్త కష్టపడుతున్నారు. కాని చంద్రబాబు మాత్రం నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తిని ఇక్కడ రంగంలోకి దించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు పార్టీ నేతలతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఆ వ్యక్తి పేరుని కూడా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. నియోజకవర్గ నేతలతో కూడా చర్చలు జరిపి వారి అభిప్రాయం తీసుకోనున్నారు. ఇక రావి వెంకటేశ్వరరావు కూడా ఎలా అయినా గెలవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు.
ఆయన గత నాలుగేళ్లలో పార్టీ బలోపేతం చేసారనే చెప్పాలి. కాని కొడాలి నాని ని ఓడించాలి అంటే ఆయన శక్తి సరిపోయే అవకాశం లేదు. అందుకనే ఇప్పుడు చంద్రబాబు చాలా జాగ్రత్తగా రాజకీయం చేస్తున్నారు. అక్కడ గత రెండు ఏళ్ళలో మూడు సర్వేలు చేయించింది టీడీపీ అధిష్టానం. నానీ గెలుస్తారని ఒక సర్వేలోనే వచ్చినా చంద్రబాబు లైట్ తీసుకోలేదు అంటున్నారు. మరి నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తి ఎవరు అనేది చూడాలి.













