ఏపీలో ఎన్నికలు ఒక చారిత్రకమైన రోజు
నవ్వుతూ పాత్రికేయులను పలకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
నిన్న ఒక చారిత్రకమైన రోజు
నన్ను ఒక పెద్దకొడుకుగా నమ్మిన తల్లిదండ్రులు, కుటుంబ పెద్దగా నమ్మి ఓట్లేసిన ఆంధ్ర ప్రజానీకం, నన్ను నమ్మి అండగా నిలిచిన చెల్లెమ్మలకు, రాష్ట్ర ప్రజలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నా..
ఇది మామూలు ఎన్నికలు కాదు, దేశాన్ని భ్రష్టుపట్టించిన నియంత మోడీ, రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడుతున్న కేసీఆర్, నేర చరిత్ర ఉన్న జగన్.. ఇంతమంది కలిసి టార్గెట్ చేసిన ఎన్నికలు.
చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా ఎండను కూడా లెక్కపెట్టకుండా వచ్చి ఓట్లేశారు.
సంక్రాంతి రోజుల్లో హైదరాబాద్ హైవేలో ట్రాఫిక్ జామ్‌లు ఉండేవి.
నిన్న ఎక్కడెక్కడి నుంచో వచ్చారు.
పూనే నుంచి వచ్చి ఓటు కోసం పోలింగ్ కేంద్రాల్లో గొడవపడుతుంటే ఆశ్చర్యం వేసింది.
బెంగుళూరు, చెన్నయ్, హైదరాబాద్, పూనే నుంచి జన్మభూమిని నిలబెట్టేందుకు వచ్చారు.
ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని స్థిర నిశ్చయంతో వచ్చారు.
బస్సుల్లో సీట్లు లేకపోతే నిలబడి వచ్చారు.
కొందరు బైకుల మీద వచ్చారు.
ప్రజల్ని నిన్న ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్నీ పెట్టారు
ఎంత హింసాత్మకం చేయాలో అంతా చేశారు.













