ప్రకాశం పంతులు మనకు ఆదర్శం
స్వాతంత్య్ర పోరాటంలోనూ, ఆంధ్ర రాష్ట్ర సాధనలోను సర్వం త్యాగం చేసిన ఆదర్శప్రాయుడు టంగుటూరి ప్రకాశం పంతులని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. టంగుటూరి 146వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలో ప్రకాశం పంతులు విగ్రహానికి ముఖ్యమంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో ప్రకాశం పంతులు చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, రాష్ట్ర విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారని ప్రశంసించారు. ముఖ్యమంత్రిగా ఆయన చూపిన చొరవ వల్ల జమీందారీ వ్యవస్థ అంతమొదిందని అన్నారు. ప్రకాశం పంతులను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి ప్రకటించారు.













