నేను నిత్య విద్యార్థిని :చంద్రబాబు
రాష్ట్రంలో నేను మొదటి విద్యార్థి. అనునిత్యం కొత్త విషయాలు నేర్చుకునేందుకు అందరి కంటే ముందుంటాను. వాటిని ప్రజలకు అమలు చేయడంలోనూ అలాగే ఉంటాను అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలోని సీవీఆర్ పురపాలక పాఠశాలలో పురపాలక పాఠశాలల తరగతి గదులను డిజిటలీకరణ చేసే విద్యావాణి ప్రాజెక్టును ప్రారంభించారు. విజయవాడలోని 14 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా 62 డిజిటల్ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఆన్లైన్లో 14 పాఠశాలల విద్యార్థులతో ముఖాముఖిగా ముచ్చటించారు.













