ఏపీ ప్రజలకు సేవ చేయడం నా బాధ్యత
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయడం నా బాధ్యత. ఎంపీగా నా విధిని నిర్వహిస్తాను అని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీగా ఉన్న ఆయన తన ఎంపీ నిధుల నుంచి సుమారు మూడున్నర కోట్లు కేటాయించి 13 ఎమర్జెన్సీ లైవ్ సపోర్ట్ అంబెలెన్స్లను కొనుగోలు చేశారు. వీటిని గన్నవరం విమానాశ్రయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సీఎం చంద్రబాబుతో కలిసి జెండా ఊపీ ప్రారంభించారు. ఈ 13 అంబులెన్స్‌లనూ జిల్లాకు ఒకటి చొప్పున కేటాయిస్తారు. ఈ సందర్భంగా సురేశ్ ప్రభు మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించడంలో ఈ అంబులెన్స్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి వైద్య సాయం అందించడంలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ట్రామా కేర్ సేవల్లో ఈ అంబులెన్స్‌లను ఉపయోగిస్తామన్నారు. వీటిలో వెంటిలెటర్తో పాటు ఆత్యాధునిక పెద్ద పరికరాలు ఉంటాయని చెప్పారు. ఈ అంబులెన్స్‌లను టెలి మెడిసిన్‌తో అనుసంధానం చేస్తామన్నారు.













