వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ షాక్.. మళ్లీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. అవినాష్‌రెడ్డికి మూడు రోజుల క్రితమే మొదటిసారి సీబీఐ నోటీసులు అందజేసింది. 24వ తేదీన విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల ఆరోజు తాను రాలేననని తెలిపారు. నిన్ని నోటీసులు ఇచ్చి నేడు విచారణకు రమ్మంటే ఎలా? అని ఆయన వ్యాఖ్యానించారు. విచారణకు హాజరయ్యేందుకు ఐదు రోజుల సమయం కావాలని అవినాష్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో రెండోసారి సీబీఐ నోటీసులు జారీ చేస్తూ 28న విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. దాదాపు రెండున్నరేళ్లుగా కేసును దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు సంస్థ ఇప్పటివరకూ ఒక్కసారీ ఆయనను ప్రశ్నించలేదు. కడప నుంచి హైదరాబాద్‌కు కేసు బదిలీ అయిన తర్వాత తాజాగా విచారణ మొదలుపెట్టిన సీబీఐ అవినాష్‌కు నోటీసులిచ్చింది.













