గవర్నర్ అనుమతి లేకుండా ..చంద్రబాబు అరెస్టు చట్టవిరుద్ధం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అక్రమం, చట్ట విరుద్ధమని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబు అరెస్టు చేయడం, దర్యాప్తు చేపట్టడం చట్టవిరుద్ధమని తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ఎ (సి) ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరని వెల్లడిరచారు. ఈ విషయంలో స్పష్టత కరువైందన్నారు. ఒకవేళ గవర్నర్ అనుమతి తీసుకుని ఉంటే, ఆ పత్రాలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. గవర్నర్ అనుమతి లేకపోతే దర్యాప్తు చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. గవర్నర్ అనుమతి లేకుండా అదుపులోకి తీసుకుంటే, అక్రమ నిర్బంధం అవుతుందని తెలిపారు. ఆ చర్యకు పాల్పడిన పోలీసు అధికారులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.













