మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను… అరెస్ట్ చేసిన సీబీఐ
అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత అరెస్టయ్యారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కేసులో సీబీఐ అధికారులు ఆమెను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఓ సంస్థ పేరుతో రూ.50 కోట్ల మేర రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదనే ఆరోపణలతో పీఎన్బీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ చేసిన తర్వాత వైద్య పరీక్షల కోసం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కొత్తపల్లి గీతన సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. గీతతో పాటు ఆమె భర్త పి.రామకోటేశ్వరావుకు న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష చొపుపన జరినామా విధించింది. బ్యాంకు అధికారులు బీకే జయప్రకాశన్, కేకే అరవిందాక్షన్‌కూ ఐదేళ్ల జైలు శిక్ష వేసింది. విశ్వేశ్వర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.2 లక్షల జరిమానా విధించింది. అనంతరం కొత్తపల్లి గీతను చంచల్‌గూడ జైలుకు తరలించారు. తెలంగాణ హైకోర్టులో ఆమె తరపున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.













