Prasanna Kumar : మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డికి షాక్
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (Vemireddy Prashanthi Reddy) పై మురికి వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ (Prasanna Kumar Reddy ) రెడ్డి పై కేసు నమోదైంది. ఓ మహిళ ఫిర్యాదుతో కోవూరు పోలీసులు (Police) అతడిపై కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్లోని 74, 75, 79, 296 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో ఈ కేసులో ప్రసన్నకుమార్ రెడ్డికి నోటీసులు (Notices) జారీ చేసి ప్రశ్నించే అవకాశముంది.













