సీబీఐకి అప్పగించిన కేసు.. రాష్ట్రానికి సంబంధం ఉంటుందా?
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమ కుటుంబానికి సంబంధం లేదంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసే ప్రమాణాలకు అర్థం లేదని మంత్రి కన్నబాబు అన్నారు. తిరుపతి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ హత్య కేసును సీఎం జగన్ సీబీఐకి అప్పగించిన విషయం తెలియదా? సీబీఐ దర్యాప్తు చేపట్టినపుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుందా? అని ప్రశ్నించారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో రెండోస్థానం కోసం టీడీపీ పోటీపడుతోందని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన వ్యాఖ్యలను మరిపించేందుకు లోకేవ్ పర్యటన సాగిందన్నారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి రావాలని సీఎం జగన్‌కు లోకేశ్ సవాల్ విసిరారన్నారు. టీడీపీ నేతలు వస్తే తాడేపల్లి ప్యాలెస్ చూపిస్తామని, హైదరాబాద్‌లో చంద్రబాబు ప్యాలెస్‌ను వైకాపా నేతలకు చూపించాలన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ప్రజలు ఆందోళన చేస్తుంటే బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడలేదని విమర్శించారు.













