ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన.. వైసీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదు..
మరికొన్ని రోజుల్లో ఎన్నికలు మొదలు కాబోతున్నాయి. అందుకే మార్చి 16 నుంచి ఆంధ్రాలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది.సీఈవో ముఖేశ్ కుమార్ మీనా నేతృత్వంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎక్కడా కోడ్ ఉల్లంఘన జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రూల్స్ ను పక్కన పెట్టి వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్న వాలంటీర్లను సైతం సస్పెండ్ చేశారు. ఇప్పుడు తాజాగా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పై కేసు నమోదు చేశారు. మార్చి 18న రాంబాబు మరికొందరు వైసీపీ నేతలతో కలిసి షాదీఖాన్ శ్లాబ్ పనుల్లో పాల్గొన్నారు. అయితే ఇది ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘించినట్లే అని రిటర్నింగ్ అధికారి తన నివేదికలో పేర్కొన్నారు. అలాగే దీనిపై వివరణ ఇవ్వాలి అంటూ ఎమ్మెల్యేకు నోటీసులు కూడా పంపారు. రీసెంట్ గా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అనుమతి లేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అతని పై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో శివ ప్రసాద్ రెడ్డి పై కూడా కేసు నమోదు చేశారు. ఈసారి ఎన్నికల సంఘం చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తోంది అని క్లియర్గా అర్థం అవుతుంది.













